విస్తరిస్తోన్న డెల్టాప్లస్ వేరియంట్.. ICMR గుడ్‌న్యూస్

by vinod kumar |   ( Updated:2021-08-02 04:49:19.0  )
విస్తరిస్తోన్న డెల్టాప్లస్ వేరియంట్.. ICMR గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: డెల్టాప్లస్ వేరియంట్‌పై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా డెల్టాప్లస్ వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ICMR వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా డెల్టాప్లస్ వేరియంట్‌‌పై సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. కొవాగ్జిన్‌ టీకా రోగ లక్షణాలున్న వ్యక్తుల్లో 77.8శాతం ప్రభావం చూపగా.. కొత్త డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పించిందని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ 93.4శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story