వారిపై ఒమిక్రాన్ దాడి.. ఐసీఎంఆర్ హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-12-22 00:49:08.0  )
వారిపై ఒమిక్రాన్ దాడి.. ఐసీఎంఆర్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒమిక్రాన్​ ప్రభావం దీర్ఘకాలిక రోగులపై అత్యధికంగా ఉంటుందని ఇండియన్​ కౌన్సిల్ ఆఫ్​మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్​) హెచ్చరించింది. డయాబెటిస్​, హైపర్​టెన్షన్​, శ్వాస సమస్యలు, కిడ్నీ, తదితర ఆరోగ్య సమస్యలున్న వారిపై ఒమిక్రాన్​ ఎక్కువ దాడి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. దీంతో ఆ కేటగిరీ వారంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని పార్లమెంట్​ సాక్షిగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతి ప్రవీణ్​ పర్వార్​హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ప్రజాప్రతినిధులంతా అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ​ వేగవంతంగా కొనసాగుతున్నా, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పంపిణీ మందగించినట్లు తెలిపారు. వెంటనే టీకాలు తీసుకొని వారికి వేయించాలన్నారు. కానీ బూస్టర్​ డోసుపై ఎప్పుడు వేస్తారనేదానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆందోళనతో ఉన్నది. తొలి విడత టీకాలు పొందిన హెల్త్​ వర్కర్లు, హైరిస్క్​గ్రూప్, వృద్ధులు, ఫ్రంట్​లైన్​ వారియర్లు బూస్టర్​డోసు వేసుకునే సమయం వచ్చేసిందని అధికారులు టెన్షన్​ పడుతున్నారు. వ్యాక్సిన్ల ప్రభావం కేవలం ఆరు నెలలే చూపుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయని, దీంతో బూస్టర్​ డోసుకూ అనుమతి ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు కూడా కేంద్రానికి లేఖ రాశారు. దానిపై కూడా ఎలాంటి రిప్లై రాలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో బీపీ, షుగర్ కలిపి 30 లక్షల మంది ఉంటారనేది అధికారుల అంచనా. దీనికి అదనంగా ఇంకో పది లక్షల మంది ఇతర దీర్ఘకాలిక సమస్యలున్న వారు ఉన్నారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు కలిపి దాదాపు 51,48,184 మంది ఉన్నారని వైద్యారోగ్యశాఖ చెబుతున్నది. దీంతో మరో నాలుగు నెలల పాటు వీరంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు నొక్కి చెబుతున్నారు

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. షాక్‌లో సీఎం

Advertisement

Next Story