- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోం లోన్లపై వడ్డీ రేటు తగ్గింపు
దిశ వెబ్‌డెస్క్: మరికొద్దిరోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు హోం లోన్లపై వడ్డీ రేటును తగ్గించగా.. తాజాగా మరో ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది.
హోం లోన్‌పై వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ఇవాళ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ రోజు నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే రూ.75 లక్షల వరకు హోం లోన్ తీసుకునే కస్టమర్లకు 6.70 శాతం ఉంటుంది పేర్కొంది. ఇక రూ.75 లక్షల పైన లోన్ తీసుకునేవారికి రూ.6.75 శాతం వడ్డీ ఉంటుందని ఐసీఐసీఐ ప్రకటించింది.
ఈ ఆర్థిక సంత్సరం ముగిస్తుండటంతో మరికొన్ని బ్యాంకులు కూడా హోం లోన్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశముంది. అందుకే హోం లోన్ కావాలనుకునేవారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.