సముద్ర తీరంలో మంచు డైమండ్స్.. ఎక్కడంటే?

by Sujitha Rachapalli |
సముద్ర తీరంలో మంచు డైమండ్స్.. ఎక్కడంటే?
X

దిశ, ఫీచర్స్ : ఇసుక తిన్నెలపై కూర్చొని, అలల తాకిడికి పరవశిస్తూ నీలిసంద్రపు అందాన్ని ఆస్వాదిస్తుంటే ఎలా ఉంటుంది? నల్లటి ఇసుక తిన్నెలపై పరుచుకున్న మంచు ముక్కలు డైమండ్స్ వలె మెరుస్తుంటే ఆ సీన్ ఇంకా అద్భుతం కదా. అయినా ఇలాంటి ప్రదేశాలు ఫాంటసీ సినిమాల్లో తప్ప నిజజీవితంలో ఉండవనుకుంటే మీరు పొరబడినట్లే. అలాంటి సముద్రపు తీరం నిజంగానే ఉందండోయ్..

ద్వీపకల్ప దేశమైన ఐస్‌లాండ్‌(Iceland)లోని ‘బ్రీయోమెర్కుర్‌సాండర్’ బీచ్ చాలా ఫేమస్. ఇక్కడి తీర ప్రాంతంలో పరుచుకున్న మంచు ముక్కలు డైమండ్ల వలె మెరుస్తూ సందర్శకులను అలరిస్తుంటాయి. ఐస్‌లాండ్ దేశ రాజధాని రేక్‌జావిక్ నుంచి 6 గంటలు జర్నీ చేస్తే ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ దేశంలోని అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ ఇదే. ఐరోపాలోనే అతిపెద్ద హిమానీనదమైన వత్నజోకుల్ నుంచి ఈ సముద్రతీరానికి వస్తుండే నీరు.. అక్కడి తీరంలో గడ్డకట్టి, డైమండ్స్ రూపంలో చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి మెరుస్తున్న దృశ్యాలను చూసేందుకు టూరిస్ట్స్ పోటెత్తుతుంటారు. కాగా ఈ డైమండ్ షేప్డ్ మంచు ముక్కలు ఒకటి కరిగేలోపు మరొకటి ఏర్పడుతుండటం విశేషం. కొవిడ్ వల్ల కొంతకాలంగా బీచ్‌లోకి ఎవరినీ అనుమతించని ఆ దేశ ప్రభుత్వం గత నెల 18 నుంచి నిబంధనలను సడలించింది. ప్రస్తుతం ఎవరైనా ఈ బీచ్‌ను సందర్శించవచ్చని ఆఫీసర్లు, టూరిస్ట్ గైడ్స్ పేర్కొన్నారు. అయితే బీచ్ సందర్శనకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించిన ఏదైనా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తేనే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story