- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్‌వెజ్ ప్రియులకు ‘మీట్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్’
దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ వేళ.. వంటశాల ఓ ప్రయోగశాలగా మారిపోయింది. ఇంటిల్లిపాది తమ ప్రయోగాలతో కొత్త కొత్త వంటకాలకు పురుడు పోశారు. ఈ క్రమంలోనే.. ‘రోజ్ ఫ్లేవర్ మ్యాగీ, న్యూటెల్లా బిర్యానీ, గులాబ్ జామున్ వడాపావ్, ఒరియో సమోసా, చాకొలెట్ దోశ, జామూన్ పిజ్జా’ వంటి భిన్నమైన వంటకాలను ప్రిపేర్ చేయడంతో పాటు వాటిని నెట్టింట్లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. కానీ ఈసారి పాకశాస్త్ర పండితులు, నలభీములు కాకుండా ఏకంగా శాస్త్రవేత్తలే రంగంలోకి దిగి కొత్త రకం ఐస్‌క్రీమ్‌తో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త చెప్పారు. ‘మీట్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్’ను అభివృద్ధి చేశారు.
ఐస్‌క్రీమ్‌లో ఇప్పటికే బటర్ స్కాచ్, బాదం, పిస్తా, సీతాఫలం, వెనిలా ఇలా బోలెడన్ని ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వెజిటేరియన్స్ కోసం డిజైన్ చేసినవే. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న వెగాన్స్‌కు కూడా ప్రత్యేకంగా ‘వెగనిజం’ ఐస్ క్రీమ్‌లొచ్చాయి. మరి నాన్‌వెజ్ ప్రియుల సంగతేంటి? అని అనుకున్నారో ఏమో గానీ రష్యాకు చెందిన మిన్స్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీట్ అండ్ డెయిరీ సంస్థకు చెందిన పరిశోధకులు.. ఈ నాన్‌వెజ్ ఐస్‌క్రీమ్‌ను తయారు చేశారు. దీన్ని ‘మీట్ ఐస్’గా పిలుస్తున్నారు. ఈ ఐస్‌క్రీమ్ తింటే నాన్‌వెజ్ తిన్న ఫీలింగే వస్తుందని వారు చెబుతున్నారు. బెలాగో నగరంలో సెప్టెంబర్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో తొలిసారిగా ఈ ‘మీట్ ఐస్’ను ప్రదర్శించారు. దీన్ని టేస్ట్ చేసిన సందర్శకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయగా, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుందని మెజార్జీ కస్టమర్లు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
ఇక నాన్‌వెజ్ ఐస్ క్రీమ్‌పై అప్పుడే జోకులు కూడా మొదలయ్యాయి. మాంసం తినాలనే కోరిక ఉంటే నేరుగా మాంసమే తినొచ్చుకదా! ఈ నాన్‌వెజ్ ఐస్‌క్రీమ్ తిని నాన్‌వెజ్ తిన్నట్లుగా ఫీల్ అవ్వటం ఎందుకు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. కానీ నాన్‌వెజ్ తినని వెజిటేరియన్స్ ఈ ఐస్‌క్రీమ్‌ను హాయిగా తినొచ్చు. ఎందుకంటే.. ఇందులో మీట్ ఉండదు. ఇది చాలా హెల్తీ ప్రొడక్ట్ అని, చాలా లైట్ స్నాక్ అని ఇరినా కల్తోవిచ్ అనే పరిశోధకుడు చెబుతున్నాడు.