- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T20 World Cup-2024: నేడే హై ఓల్టేజ్ మ్యాచ్.. సమరానికి సై అంటున్న టీమిండియా, షాక్‌లో పాకిస్థాన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టీ20 వరల్డ్ కప్-2024లో అద్భత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గ్రూప్-ఏలో భాగంగా చిరకాల ప్రత్యర్థులై భారత్, పాకిస్థాన్ జట్టు మరోసారి తలపడోతున్నాయి. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరగ్గా ఆరు ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు మాత్రమే వందకుపైగా పరుగులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కీలక పోరులో గెలుపు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, కోహ్లీ, జైస్వాల్, పంత్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్లతో టీమిండియా పటిష్టంగా ఉంది. అదేవిధంగా బౌలింగ్ యూనిట్‌లో బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్లతో పర్వాలేదనేలా ఉంది.
బిగ్ షాక్‌లో పాకిస్థాన్..
ఇక ప్రత్యర్థి పాక్ విషాయానికి వస్తే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆ జట్టు ఆతిథ్య జట్టు అమెరికా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టై అయిన ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ఆమెరికా సంచన విజయాన్ని నమోదు చేసింది. బాబార్, ఆజమ్ ఖాన్ మాత్రమే బాధ్యతాయుతంగా ఆడ పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. ఇక బౌలర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు.. మహమ్మద్ ఆమీర్, అసద్ రవూఫ్, షామీన్ ఆఫ్రిదీ చెప్పకొదగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది. కాగా, నేటి మ్యాచ్‌లో వారంతా టీడమిండియా బ్యాట్స్‌మెన్లకు అడ్డుకుంటారా.. లేక ధారాళంగా పరుగులు ఇస్తారో చూడాల్సిందే.