- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ షెడ్యూల్‌పై ఐసీసీ అసంతృప్తి
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19న ప్రారంభించి అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. ఐపీఎల్ షెడ్యూల్, ఇతర ఏర్పాట్లపై గత మూడు రోజులగా బీసీసీఐ పెద్దలు ఎమిరెట్స్ క్రికెట్ బోర్డ్ అధికారులతో చర్చలు జరిపారు.
కాగా, అక్టోబర్ 15న ఐపీఎల్ నిర్వహించడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తుండటంతో అక్టోబర్ 10లోపు ఐపీఎల్ ముగించాలని ఐసీసీ సూచించింది. కానీ బీసీసీఐ మాత్రం అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహించేందుకు సిద్దపడింది. ఈ విషయంలోనే ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 18న ప్రారంభించాల్సి ఉండగా.. దానికి మూడు రోజుల ముందు వరకు ఐపీఎల్ షెడ్యూల్ పొడిగించడంపై ఐసీసీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది.