- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ చైర్మన్ ఎన్నికపై రేపు కీలక సమావేశం
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు బోర్డు సభ్యులు సోమవారం భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ, ఓటింగ్ పద్ధతి, ఇతర అంశాలను చర్చించనున్నాను.
చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ దిగిపోయి నెలన్నర కావొస్తున్నది. ఇప్పటికీ క్రికెట్ అత్యున్నత మండలి తాత్కాలిక చైర్మన్‌తోనే నెట్టుకొస్తున్నది. అయితే, ఐసీసీ చైర్మన్ పదవి ఏకగ్రీవం కాకుండా ఎన్నిక నిర్వహించాల్సి వస్తే ఏం చేయాలన్న విషయం వద్దే కొంచెం వివాదం నెలకొన్నట్లు తెలుస్తున్నది. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను చైర్మన్ పదవికి ఎంపిక చేయాలా లేదా కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వస్తేనే చైర్మన్ పదవికి అర్హుడా అనే నిబంధనపై బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక సోమవారం నాటి సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రూపొందిస్తారని, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఐసీసీ చైర్మన్ రేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉంటారా లేదా అనే సందిగ్దానికి తెరపడలేదు. దీనిపై అటు బీసీసీఐ కానీ ఇటు గంగూలీ కానీ నోరు విప్పడం లేదు.