యూఏఈలోనే టీ20 వరల్డ్ కప్

by Shyam |
యూఏఈలోనే టీ20 వరల్డ్ కప్
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదా పడటంతో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఇండియాలో జరగాల్సిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, వరల్డ్ కప్‌ను యూఏఈకి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుత పరిస్థిత్లులో వరల్డ్ కప్ ఆడటానికి చాలా జట్లు ఇండియాకు రావడానికి సుముఖంగా ఉండవని.. అందుకే యూఏఈ వేదికగా బీసీసీఐ మెగా టోర్నీని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్‌లో 8 జట్లకు బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా నుంచి తప్పించుకోలేక పోయినందునే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

టీ20 వరల్డ్ కప్‌లో 16 జట్లు పాల్గొంటున్నాయి. యూఏఈలోని అబుదాబి, షార్జా, దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లు సిద్దంగా ఉన్నాయి. దుబాయ్‌లో ఐసీసీకి చెందిన రెండు గ్రౌండ్లు అదనంగా ఉన్నాయి. కరోనా సమయంలో ఎలాగో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో మొత్తం 5 స్టేడియంలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రతీ స్టేడియంలో ఉండే మూడు పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంటంతో బీసీసీఐ వరల్డ్ కప్‌ను యూఏఈ తరలించడానికి నిర్ణయించింది. అయితే ముందుగా ఈ ప్రతిపాదనను ఐసీసీ తెలియజేస్తే.. క్రికెట్ అత్యున్నత సంస్థ తుది నిర్ణయం తీసుకోనున్నది.

Advertisement

Next Story

Most Viewed