ఆ రూల్స్ మార్చేసిన ఐసీసీ

by Shiva |
ఆ రూల్స్ మార్చేసిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ రూల్ బుక్ మార్చాలంటే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ మార్చాల్సిందే. అయితే ఇటీవల కాలంలో ఆన్ ఫీల్డ్/ఆఫ్ ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో పలు క్రికెట్ బోర్డులతో పాటు క్రికెట్లు కూడా ఐసీసీకి పిర్యాదు చేశారు. ముఖ్యంగా సాఫ్ట్ సిగ్నల్, అంపైర్స కాల్, షార్ట్ రన్ వంటి విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలు సరిగా లేవని పిర్యాదులు అందాయి. ఇటీవల ముగిసిన ఇంగ్లాడ్-ఇండియా సిరీస్‌లొ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. సూర్యకుమార్ క్యాచ్ నుంచి అంపైర్ కాల్ నిర్ణయాల వరకు తీసుకున్న డెషిషన్స్ కెప్టెన్ కోహ్లీ కూడా వ్యతిరేకించాడు. దీనిపై బీసీసీఐ కూడా ఐసీసీకి పిర్యాదు చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో ఐసీసీ క్రికెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

అంపైర్స్ కాల్‌పై కీలక నిర్ణయం

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది అంపైర్స్ కాల్ మాత్రమే. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్స్ కాల్ వల్ల టీమ్ ఇండియాకు చాలా నష్టం జరిగింది. దీంతో కెప్టెన్ కోహ్లీ ఆ నిబంధనను పూర్తిగా వ్యతిరేకించాడు. అంపైర్స్ కాల్ వల్ల మా జట్టుకు చాలా నష్టం జరిగిందని బాహాటంగానే వెల్లడించాడు. కోహ్లీతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐకి పిర్యాదు చేసింది. దీంతో బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్‌ సూచనలు పరిగణలోకి తీసుకొని ఐసీసీకి లేఖరాసింది. ఇతర క్రికెట్ బోర్డుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఐసీసీ క్రికెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ ఈ నిర్ణయాలకు పచ్చ జెండా ఊపగా.. ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.

ఇవే ఐసీసీ నిర్ణయాలు..

– డెషిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) పద్దతిలో తీసుకునే ఎల్బీడబ్ల్యూ నిర్ణయం తుది నిర్ణయం కాదని వెల్లడించింది. ఫీల్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ (టీవీ అంపైర్) తిరస్కరించే అవకాశం కల్పించింది
– అంపైర్స్ కాల్ అంటే గతంలో వికెట్ల వరకు మాత్రమే కొలిచే వాళ్లు. ఏదైనా వికెట్‌కు 50 శాతం కంటే ఎక్కువ తగిలితేనే అంపైర్స్ కాల్‌‌ను ఆమోదించే వాళ్లు. ఇకపై వికెట్లపై ఉన్న బెయిల్స్‌కూడా పరిగణలోకి తీసుకుంటారు. 50 శాతం కాకుండా వికెట్లకు తగిలితే అవుట్‌గా పరిగణిస్తారు.
– షార్ట్ రన్ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తుది నిర్ణయం కాబోదు. థర్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయమే అంతిమం కానున్నది
– పురుషుల వన్డే క్రికెట్‌లో మ్యాచ్ టై అయితే రిజల్ట్ టైగానే ఉంచుతున్నారు. అయితే మహిళల మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చనున్నారు.

Advertisement

Next Story

Most Viewed