ఫిఫాను దాటేసిన ఐసీసీ

by Anukaran |   ( Updated:2021-01-23 05:17:13.0  )
ఫిఫాను దాటేసిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత పెద్ద క్రీడా సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా). ఈ క్రీడా సంస్థలో ఎన్నో దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉండటంతో ఈ సంస్థ కూడా అన్ని దేశాలకు విస్తరించింది. మరోవైపు క్రికెట్ అత్యున్నత సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (ఐసీసీ) కూడా పలు దేశాల్లో వ్యాపించి ఉన్నది. కానీ, సభ్యత్వాల విషయంలో ఫిఫా కంటే ఐసీసీ వెనుకబడి ఉన్నది. కానీ ఒక విషయంలో మాత్రం ఫిఫాను ఐసీసీ దాటేసింది. సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడా సంస్థగా ఐసీసీ రికార్డు సృష్టించింది. ఐసీసీ సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్లు చాలా ఎక్కువ. అంతే కాకుండా ఈ పోస్టులను లైక్ చేసే వాళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఐసీసీకి సోషల్ మీడియాలో 59 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. ఫిఫాకు 37.7 మిలియన్లు, ఫిబాకు 12.2 మిలియన్ మంది ఉన్నారు. ఐసీసీ పోస్టులకు అభిమానుల నుంచి చాలా ఆదరణ ఉంటుందని బీసీడబ్ల్యూ స్పోర్ట్ అనే కన్సెల్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

Advertisement

Next Story