- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐబీఎంలో కొత్త నియామకాలు!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తుంటే, ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం ఇండియాలో కొత్త ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించింది. ఐబీఎం వెబ్‌సైట్ లింక్‌డ్ ఇన్ పేజీలో కొత్తగా 500 నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. మేనేజర్లు, మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్, నెట్‌వర్క్, డేటా సైంటిస్ట్‌ల విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఐబీఎం సంస్థలో 3.5 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో మూడవ వంతు ఉద్యోగులు ఇండియాలోనే ఉన్నారు. అయితే, ఐబీఎం సొంత దేశమైన అమెరికాలో కంటే ఇండియాలో ఎక్కువమందిని నియమించుకోవడం పట్ల అమెరికాలోని నిరుద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐబీఎం వంటి దిజ్జగ టెక్ కంపెనీలు ఇండియాలో ఉన్న ఐటీ నిపుణులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కంపెనీకి ఐటీ నిపుణుల కొరత వేధిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.