హీరోగా మారిన ఐఏఎస్ ఆఫీసర్..

by Shyam |
హీరోగా మారిన ఐఏఎస్ ఆఫీసర్..
X

నటనపై మక్కువ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సూపర్‌స్టార్‌గా ఎదగాలన్న తపన, పట్టుదల.. ఖచ్చితంగా ఆ స్టేజ్‌కు చేరుస్తుంది. ఒక సాధారణ బస్ కండక్టర్ అయిన శివాజీరావు గైక్వాడ్.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గా ఎదిగి, దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తీరు మనకు తెలిసిందే. ఇపుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా హీరోగా మారిపోయాడు. తన ఇంటెన్సివ్ యాక్టింగ్ స్కిల్స్‌తో లేటెస్ట్ సెన్సేషన్‌గా మారాడు.

బి ప్రాక్ లేటెస్ట్ మ్యూజికల్ హిట్.. ‘దిల్ తోడ్ కే’. ఇందులో నటించిన హ్యాండ్‌సమ్ హీరో అభిషేక్ నటనకు ఫిదా అయ్యారు నెటిజన్లు. తన అద్భుతమైన నటనను చూసేందుకు ప్రేక్షకులు పదే పదే ఆ ఆల్బమ్‌ను చూస్తుండగా, యూట్యూబ్‌లో ఈ వీడియో ఐదు రోజుల్లో 26 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. అభిషేక్ ప్రస్తుతం ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తుండగా.. ఆల్బమ్‌లో ఆయన పిస్టల్ యూజ్ చేసే తీరుకు ఆడియన్స్ పడిపోయారు. తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో భారీ కాంప్లిమెంట్స్ అందుకుంటున్న అభిషేక్.. అతి త్వరలో సూపర్‌స్టార్ కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఫ్యూచర్‌లో స్టార్ హీరోగా ఎదగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed