- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్నోవేషన్స్ తో కరోనాకు చెక్ చెబుతున్న ఐఏఎస్ ఆఫీసర్
దిశ వెబ్ డెస్క్ : లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. క్వారంటైన్ పాటిస్తున్నా… ఒక చిన్న పొరపాటు వల్ల.. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ పోతోంది. అయితే ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసేందుకు జార్ఖండ్ కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాడు. ఇంజనీరింగ్ చదివిన ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు తన ఇంజనీరింగ్ ప్రతిభను కరోనాకు చెక్ చెప్పడానికి ఉపయోగిస్తున్నాడు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా తన పంజా విసురుతోంది. అయితే జార్ఖండ్ లోని వెస్ట్ సింగభం జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. దానికి కారణం.. డిప్యూటీ డెవల్మెంట్ కమిషనర్ (డీడీసీ) ఆదిత్య రంజన్. ఆయన కరోనా నియంత్రణకు అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, కరోనా కట్టడికీ ఉపయుక్తమైన ఐదు పరికరాలను రూపొందించాడు. ‘జార్ఖండ్ లో .. నక్సలిజం, పేదరికం ఎక్కువ.. వీటితో పాటు కరోనా కూడా అటాక్ అయితే.. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువల్లే ‘చికిత్స కంటే నివారణే ముఖ్యమనే మోటోను ఫాలో అవుతున్నాం. వైద్య సిబ్బందికి, అనారోగ్య బాధితులకు మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా ఉండేలా మేం కొన్ని ఇన్వెన్షన్స్ చేశాం’ అని ఆదిత్య చెప్పొకొచ్చారు. ఆయన రూపొందించిన వాటిలో డిసిన్ఫిక్టెడ్ చాంబర్, లోకాస్ట్ ప్రొటెక్టివ్ షీల్డ్స్, కో బాట్ ప్రధానమైనవి.
1. డిసిన్ఫెక్ట్ చాంబర్ :
వైరస్ ను చంపడానికి ఆదిత్య పోర్టబుల్ డిసిన్ఫెక్ట్ చాంబర్ ను రూపొందించాడు. 30 సెకన్లలోనే ఒక వ్యక్తిని ఇది డిసిన్ఫెక్ట్ చేస్తుంది. చక్రదర్పుర్ పట్టణంలోని ‘సౌత్ ఈస్టర్న్ రైల్వే హస్పిటల్’ లో ఈ చాంబర్ ను ఉపయోగిస్తున్నారు. ఇందులో హైపోక్లోరైట్ , సల్ఫర్, ఐనోజైడ్డ్ వాటర్ వంటివి ఉపయోగించరు. ఎందుకంటే స్కిన్ డిసిజ్ వస్తాయని అంతేకాదు కళ్లు కూడా మంటలెక్కతాయని ఆదిత్య చెబుతున్నారు. దాంతో శానిటైజర్ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. 25 వేలతో రూపొందించిన ఈ పరికరంలో 7 లీటర్ల శానిటైజర్ ఉపయోగించవచ్చు. అంతేకాదు వైద్య బృంద ధరించే పీపీఈ కిట్లను కూడా ఇది శుభ్ర పరుస్తుంది.
2. కో-బాట్:
నిరంతరం కరోనా పేషెంట్ల నడుమ తిరిగే డాక్టర్లకు కూడా కరోనా రావడంతో ఆదిత్యం ‘కో-బాట్’ను రూపొందించాడు. ఇది కరోనా పేషెంట్లకు మందులు, ఫుడ్ ను తీసుకువెళుతోంది. ఇది 30 కిలోల వరకు బరువులను మోసుకెళ్తోంది. రిమోట్ తో నడితే ఈ రోబో 300 అడుగుల దూరం వరకు వెళుతోంది. దీనికి కెమెరాతో పాటు, స్పీకర్లు కూడా ఉంటాయి.
3. ఫోన్ బూత్ కలెక్షన్స్ :
ఆదిత్య స్టాటిక్, పోర్టబుల్ అనే రెండు రకాల ఫోన్ బూతులను రూపొందించాడు. సాంపుల్స్ ఇచ్చే వ్యక్తికి, సాంపుల్స్ తీసుకునే వ్యక్తికి మధ్య కనెక్షన్ లేకుండా విధంగా వీటిని తయారు చేశాడు. పీపీఈ కిట్ అవసరం లేకుండానే ఫోన్ బూత్ లో సాంపుల్స్ తీసుకోవచ్చు.
4. ఫేస్ షీల్డ్ :
చాలా మంది ప్రభుత్వాధికారులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి కోసం ఫేస్ షీల్డ్ ను రూపొందించాడు ఆదిత్య. ఇది కేవలం 110 రూపాయల్లో తయారు చేశాడు. సిలికాన్ స్ట్రాప్ తో ఫోర్ హెడ్ పై ధరించేలా ఇది ఉంటుంది. ఉమన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో 3 వేల ఫేస్ షీల్డ్స్ తయారు చేసి హెల్త్ వర్కర్స్, పోలీస్, రైల్వే పోలీసు అధికారులకు అందించాడు. ముఖం మొత్తం కవర్ చేసే ఫేస్ షీల్డ్ తుంపరలను అడ్డుకుంటుందని ఆదిత్య తెలిపాడు.
5. ఐ -బెడ్ :
ఆసుపత్రిలో ఒక పేషెంట్ వల్ల మరో పేషెంట్ కు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్లే.. వాషేబుల్ ప్లాస్టిక్ కవర్ తో బెడ్ ను లామినేట్ చేసే ఆలోచనతో ముందుకు వచ్చాడు ఆదిత్య. దానికి ఐ -బెడ్(ఐసోలేషన్ బెడ్) అని పేరు పెట్టాడు దీనివల్ల ఇనెఫెక్షన్ స్ప్రెడ్ తక్కువ అవుతుంది. ఇప్పటికే ఇలాంటి 50 పడకలను తయారు చేసి రెండు ఆస్పతుల్లో వినియోగిస్తున్నారు.
Tags: corona virus, innovations, i-bed, face shield, disinfection chamber, aditya ranjan, leh, jarkhand