ఉత్తరాఖండ్‌ నుంచి ఐఏఎఫ్ కార్యకలాపాలు

by Shamantha N |
ఉత్తరాఖండ్‌ నుంచి ఐఏఎఫ్ కార్యకలాపాలు
X

డెహ్రాడూన్: భారత్, చైనా సరిహద్దులో కార్యకలాపాలను ఉత్తరాఖండ్ నుంచి నిర్వహించడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫోర్స్ (IAF) రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నది. డిఫెన్స్ రాడార్ ఫెసిలిటీలను ఏర్పాటు చేసుకోవడానికి, ఉన్నత సదుపాయాలున్న ల్యాండింగ్ గ్రౌండ్ కోసం సెంట్రల్ ఎయిర్ కమాండ్ చీఫ్, ఎయిర్ మార్షల్ రాజేష్ కుమార్, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో భేటీ అయ్యారు.

వ్యూహాత్మక అవసరాల కోసం ఉత్తరాఖండ్‌లోని చమోలి, పితోరగడ్, ఉత్తరకాశి పర్వత జిల్లాల్లో భూమి కోసం సీఎంను ఎయిర్ మార్షల్ రాజేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పట్నాగర్, జాలీగ్రాంట్, పితోరగడ్ ఎయిర్‌పోర్టుల విస్తరణతోపాటు చౌకుతియాలో విమానాశ్రయానికి భూమి కేటాయించాలని అభ్యర్థించారు. ఐఏఎఫ్ విజ్ఞప్తిపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సానుకూలంగా స్పందించారు. ఐఏఎఫ్‌కు భూమి కేటాయించడానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి కేటాయించడానికి నోడల్ అధికారి నియామకానికి ఆదేశించారు.

Advertisement

Next Story