లేకుంటే.. ఆమరణ దీక్ష చేస్తా: వీహెచ్

by Shyam |   ( Updated:2020-12-18 05:21:19.0  )
Congress leader VH
X

దిశ,వెబ్‌డెస్క్: ఏప్రిల్ 14లోగా పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14లోగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే తాను అమరణ నిరహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. కాగా ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో వీహెచ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story