- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని వల్ల అంపైర్లపై గౌరవం తగ్గుతోంది: చాపెల్
దిశ, స్పోర్ట్స్: డెషిషన్ రెవ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) కారణంగా క్రికెటర్లకు అంపైర్లపై గౌరవం తగ్గుతున్నదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు. వెంటనే డీఆర్ఎస్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేయడం అవసరమని, ఈ విధానంపై తనకు పెద్దగా నమ్మకం లేదని చాపెల్ అన్నాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ వినియోగం అత్యంత దారుణంగా ఉందని చాపెల్ అన్నాడు. ‘డీఆర్ఎస్ విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. దీని వల్ల అంపైర్లపై గౌరవం సన్నగిల్లుతున్నది. ఈ విషయం ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తెలిసింది. అంపైర్ల అధిక నిర్ణయాలను ఆటగాళ్లు సవాలు చేశారు. అనేక తప్పులు ఇందులో బయటపడ్డాయి. అందుకే తొలి నాళ్లలో బీసీసీఐ ఈ డీఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకించింది’ అని చాపెల్ చెప్పుకొచ్చారు. ఇంతకు మునుపే డీఆర్‌ఎస్ విషయంలో ‘అంపైర్స్ కాల్’ అనే నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని అపెక్స్ బోర్డుకు సూచించాడు. సచిన్‌కు ఇప్పుడు చాపెల్ మద్దతు తోడవడం గమనార్హం.