- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టీమిండియా కోసం ఏం చేయడానికైనా సిద్ధం’
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్దంగా ఉన్నానని.. జట్టు యాజమాన్యం తన నుంచి ఏం కోరుకుంటే ఆ బాధ్యతను నెరవేరుస్తానని టెస్ట్ ప్లేయర్ హనుమ విహారి అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన విహారి.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. వార్విక్‌షైర్ కౌంటీ తరపున క్రికెట్ ఆడుతున్ విహారి రాబోయే కీలక పర్యటన గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడాడు. తాను క్రికెట్ ఆడటం ఆరంభించిప్పటి నుంచి ఎక్కువగా టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు.
టాప్ఆర్డర్‌లో బ్యాటింగ్ ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. మొదటి నుంచి తనకు సవాళ్లు స్వీకరించడం అలవాటు.. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని అన్నాడు. సిడ్నీ టెస్టులో గాయం బాధిస్తున్నా మూడున్నర గంటల పాటు అశ్విన్‌తో కలసి బ్యాటింగ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ రోజు పరుగులు పెద్దగా చేయకపోయినా.. మరో ఎండ్‌లో ఉన్న అశ్విన్‌కు ఇచ్చిన అండ ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడటం వల్ల తనకు ఇక్కడి పరిస్థితులు అలవాటు అవుతున్నాయని విహారి అన్నాడు. ఇంగ్లాండ్‌లో శీతాకాలం క్రికెట్ ఆడటం చాలా బాగుంటుందని అన్నాడు. కాగా, టీమ్ ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ చేరుకోగానే అక్కడే హనుమ విహారి జట్టుతో పాటు కలవనున్నాడు.