టీం ఇండియా జెర్సీ ధరించడం నాకు గర్వంగా ఉంది : ప్రియాంక్ పంచల్

by Shyam |   ( Updated:2021-12-14 06:42:44.0  )
టీం ఇండియా జెర్సీ ధరించడం నాకు గర్వంగా ఉంది : ప్రియాంక్ పంచల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోసం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో ‘ప్రియాంక్ పంచల్’ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం కొత్తగా నియామకమైన టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరం గాయం కారణంగా ‘ప్రోటీస్‌’ వేదిక‌ జరిగే టెస్ట్ సిరీస్‌కు దూరమవుతాడని ప్రకటించింది. అయితే, రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేశారు. ట్విట్టర్‌లో ఈ యువ క్రికెటర్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన పంచల్ “టీమ్ ఇండియా జెర్సీని ధరించడం తనకు గౌరవంగా ఉంది” అని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసినందుకు బీసీసీఐకు ధన్యవాదాలు తెలిపాడు పంచల్.. అంతేకాకుండా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నానని తన ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

ప్రియాంక్ పంచల్ 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు , 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 100 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత పంచల్‌కు ఎట్టకేలకు టెస్టు సిరీస్‌లో చోటుదక్కింది. పంచల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్, మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed