- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ,వబ్ డెస్క్ : చిన్నప్పటి నుంచి నేను చిరంజీవికి వీరాభిమానిని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం మమత ఆసుపత్రి మైదానంలో ఆదివారం రాత్రి శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ వేడుక చాలా సందడిగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి అజయ్ కుమార్ హాజరయ్యారు. చిరంజీవిని వేదిక పైకి మంత్రి తీసుకరావడంతో అక్కడున్న ప్రేక్షకులందరూ మెగాస్టార్ ..మెగాస్టార్ అంటూ కేకలు వేశారు. అనతరం మంత్రి మాట్లడుతూ నా కళశాల రోజుల్లో నేను చిరంజీవి పాటలకి స్టెప్స్ వేసేవాడినని తన సినిమాలన్నా అతనన్నా, తనకు చాలా ఇష్ట్రం అన్నారు.
అలానే చిరంజీవి తనకి అన్నలాంటి వారన్నారు. కేటీఆర్ కి రామ్ చరణ్ కి మంచి మిత్రుడని చిరంజీవికి ఎలాంటి అసౌకర్యం కలగకుడా చూసుకోవలన్నారని, అందుకే తన నివాసంలోనే తనకు ఆథిత్యం ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులు చిరంజీవికి జ్ఞానిపికని అందించారు. అనతరం చిరంజీవి మాట్లడుతూ.. 12 ఏళ్ల క్రితం ప్రజా అంకిత యాత్రకు ఖమ్మం వచ్చినప్పుడు తనకు అనూహ్య స్పందన లభించిందని ,అదే ప్రేమ,అభిమానం చెక్కు చెదరలేదన్నారు. పోరాటాల ఖిల్లా ఖమ్మంకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
అనతరం శర్వానంద్ అభిమానులు శర్వానంద్ తో పాటు చిరంజీవికి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాని వ్యాఖ్యాతలుగా శ్యామల,హేమంత్ వ్యవహరించారు. హిరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్,హిరో వేదికపైకి రావడంతో ప్రేక్షకులు కేరింతలతో సందడి చేశారు. వస్తానంటివో పోతానంటివో అనే చిరంజీవి సినిమాలో పాటపాడి పెంచలయ్య అందరిని ఆకట్టుకున్నాడు.