మూడు నెలల్లో జలవిద్యుత్ పునరుద్ధరణ

by Shyam |
మూడు నెలల్లో జలవిద్యుత్ పునరుద్ధరణ
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలంలో మూడు నెలల్లోనే జల విద్యుత్‌ను పునరుద్దరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 20న జరిగిన ప్రమాదంతో 1,2 యూనిట్లలో విద్యుత్ నిలిచిపోగా సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. వాస్తవానికి త్వరితగతిన పూర్తి చేసి ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులతో సహా ఇంజినీర్లు, సిబ్బంది కొవిడ్ బారిన పడడంతో జాప్యం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారని తెలిపారు. 4వ యూనిట్ పూర్తిగా ధ్వంసమైనందున మే నెల వరకు పునరుద్ధరణ జరుగవచ్చునని వెల్లడించారు.

Advertisement

Next Story