- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చివరి నిమిషంలో గోల్.. మ్యాచ్ డ్రా చేసుకున్న హైదరాబాద్
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి తిలక్ మైదాన్‌లో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన హైదరాబాద్ క్లబ్ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇరుజట్లు తొలి అర్దభాగంలో హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఇక రెండో అర్దభాగం మొదలయ్యాక 59వ నిమిషంలో ఆంథొని ఇచ్చిన పాస్‌ను బ్రైట్ ఎనొబకారె గోల్‌గా మలచడంతో ఈస్ట్ బెంగాల్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రిఫరీ ఇంజ్యూరీ టైం కలిపాడు. ఆ సమయంలో హైదరాబాద్ ఎఫ్‌సీ ఆటగాడు అరిడానే సాంటానా గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇరు జట్లు 1-1తో ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆంథొని పిల్కింగ్టన్ డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, ఆకాష్ మిశ్రా హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.