నగర యువతకు హ్యాట్సాఫ్

by Shyam |
నగర యువతకు హ్యాట్సాఫ్
X

దిశ, హైదరాబాద్: కరోనా కల్లోలంతో యావత్తు జన జీవనం అతలాకుతలం అవుతోంది. దేశమంతా లాక్ డౌన్ కావడంతో సామాన్యుల నుంచి ధనికుల వరకూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పరిస్థితుల ప్రభావంతో ఏ దిక్కూ లేకుండా రోజంతా ఫుట్ పాత్ లే జీవనాధారంగా భావిస్తున్న వారి పరిస్థితి దుర్భరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆయా దైనందిన చర్యలు ఉంటేనే వీరికి ఎవరో ఒకరు దగ్గర బుక్కెడు అన్నం అడుక్కుని ఏ రోజుకు ఆరోజు గడుపుకుంటారు. అయితే, ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల మధ్య వీరికి ఫుట్ పాత్ లపై ఉండే వారికి ప్రస్తుతం అన్నం దొరకడం చాలా కష్టంగా మారింది. అయితే, నగరంలోని బాగ్ లింగంపల్లికి చెందిన చరణ్, వరుణ్, పవన్, విజయ్ అనే నలుగురు యువకులు వారింట్లో ప్రత్యేకంగా పులిహోరా తయారు చేయించుకుని ట్ పాత్ లపై ఉన్న వారందరికీ ఆహారం, మంచినీరు అందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.

Tag:Corona, Footpath Beggars, youth helping, Hyderabad

Advertisement

Next Story

Most Viewed