- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం ఆలోచన.. అది జరిగితే తెలంగాణవాసులకు శుభవార్తే
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నుంచి ముంబయికి హై స్పీడ్ రైలు సర్వీసు నడపాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం మీద ఏడు హై స్పీడ్ రైలు సర్వీసులను నడపించాలని భావిస్తున్న రైల్వే మంత్రిత్వశాఖ ఈ మేరకు అధ్యయనం చేస్తోంది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి, అహ్మదాబాద్ మధ్య రెండు సర్వీసులు కూడా ఈ ఏడింటిలో ఉన్నాయి. ఇక వారణాసి నుంచి హౌరాకు కూడా మరో సర్వీసు నడపాలని భావిస్తోంది. చెన్నై-మైసూర్, ఢిల్లీ-అమృత్‌సర్, ముంబయి-నాగ్‌పూర్ మధ్య కూడా ఇదే తరహాలో హై స్పీడ్ రైళ్లను నడిపించాలని అనుకుంటోంది.
అయితే ప్రస్తుతానికి ఇది ఆలోచన మాత్రమేనని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలోని ఏడు మార్గాల్లో హై స్పీడ్ రైళ్ళను నడపడానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్పోరేషన్.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందిస్తుందని, ఆ తర్వాతనే మరింత దీనిపై స్పష్టత వస్తోందని వివరించారు. అధ్యయనంలో భాగంగా సాంకేతిక అంశాలు, ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందని, వనరులను సమీకరించుకోవడం ఎలా, రాష్ట్రాల భాగస్వామ్యం ఎలా ఉండాలి తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ రైలు సర్వీసులను ప్రారంభించడంపై కార్పొరేషన్ ఒక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.