- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. తండ్రిపై వేడినూనె పోసి గొళ్ళెం పెట్టి పారిపోయిన కొడుకు
దిశ, శేరిలింగంపల్లి: మద్యానికి బానిసగా మారాడు. ఆ మత్తులో కనిపెంచిన తండ్రిపై వంట నూనె పోసి తగలబెట్టి ఆ తర్వాత గొళ్ళెం పెట్టి పారిపియాడు ఓ ప్రబుద్ధుడు. ఇంట్లో నుంచి పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రానగర్ లో నివాసం ఉంటున్న దుర్గారావు కుమారుడు నాగబాబు మద్యానికి బానిసగా మారాడు. తల్లి తండ్రులు కష్టపడి తెచ్చిన డబ్బులను బెదిరించి లాక్కొని మద్యం తాగేవాడు. తండ్రికి అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తనకు డబ్బులు కావాలని అడగడంతో నిరాకరించిన తండ్రిపై వంట నూనె పోసి నిప్పంటించిన కొడుకు అక్కడ నుండి పారిపోయాడు. దుర్గారావు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.