రెడ్ అలర్ట్.. నగరవాసులు ‘జల’ భద్రం

by Shyam |   ( Updated:2021-07-14 23:33:34.0  )
రెడ్ అలర్ట్.. నగరవాసులు ‘జల’ భద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాతావరణ శాఖ హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రాకతో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో వారం రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో సరూర్నగర్ లోని కొన్ని ఇళ్ళలోకి నీరు వచ్చింది. అలాగే ఎల్బీ నగర్ లోతట్టు ప్రాంతాలలోని సుమారు 150 వరకు ఇల్లు జలమయమయ్యాయి.

ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మేడ్చల్, మల్కాజిగిరి, జీడిమెట్ల, లింగంపల్లి, మల్లాపూర్, ఘట్కేస,ర్ ఎల్బీ నగర్, సరూర్ నగర్, చంపాపేట్, చార్మినార్, చంద్రాయన గుట్ట, అరంగల్ చౌరస్తా, శంషాబాద్, మచిలీపట్నం, ఉప్పల్, హయత్ నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అధికారులు అప్రమత్తమై విద్యుత్ అధికారులు అంతరాయాన్ని పునరుద్ధరించాలని నగర వాసులు కోరుతున్నారు. అయితే మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed