వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

by Shyam |
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని, తరలిస్తున్న కంటైనర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story