చైనా ఆన్​లైన్​ గేమింగ్​ గుట్టురట్టు

by Anukaran |   ( Updated:2020-08-13 11:28:05.0  )
చైనా ఆన్​లైన్​ గేమింగ్​ గుట్టురట్టు
X

దిశ, క్రైమ్​బ్యూరో: చైనా ఆన్​లైన్​ గేమింగ్(​‌China Online Gaming)ను గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్(Telegram) గ్రూపుల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్‌లో నగరానికి చెందిన ఒకరు రూ.1.60 లక్షలు, మరొకరు రూ.97వేలు పోగొట్టుకోవడంతో సీసీఎస్​ పోలీసులను (CCS police)ఆశ్రయించారు. వివిధ వెబ్​సైట్(Website)​ల ఆధారంగా నిర్వహించే ఈ గేమింగ్​ ప్రతిరోజూ వెబ్​‌సైట్​లను మారుస్తూ ఉంటుంది.

అమెరికా డేటా(American Data) హోస్టింగ్​‌తో చైనా నుంచి ఆపరేట్​ చేస్తుండగా భారతీయులు(Indians) కూడా డైరెక్టర్లుగా వ్యవహారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మొత్తం 28కంపెనీలు ఉన్నాయి. బ్యాంకింగ్‌(Banking)తో పాటు ఇతర మార్గాల ద్వారా చెల్లింపులు జరగ్గా ఇప్పటివరకూ రెండు ఖాతాల్లో దాదాపు రూ. 1100 కోట్లు చెల్లింపులు అయినట్లు గుర్తించారు. విదేశీ ఖాతాల(Foreign accounts)కు రూ.110 కోట్లు, ఓ బ్యాంకు ఖాతాకు చెందిన రూ. 30కోట్లును పోలీసులు సీజ్​ చేశారు. చైనాకు చెందిన యాహ్ హావో (సౌత్ ఈస్ట్ ఆసియా ఆపరేషన్స్ హెడ్), గురుగ్రామ్​(Gurugram)కు చెందిన ధీరజ్ సర్కార్, ఢిల్లీ( Delhi)కి చెందిన అంకిత్ కపూర్, నీరజ్ తులి అనే నలుగురు డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed