- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISLలో రేపు హైదరాబాద్ ఎఫ్‌సీతో తలపడనున్న ముంబై సిటీ..
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎఎల్) 2021-22 సీజన్‌లో శనివారం హైదరాబాద్ ఎఫ్‌సీ కీలక మ్యాచ్‌లో ముంబై సిటీతో తలపడనున్నది. గోవాలోని ఫటోర్డా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ముంబైపై గెలిచి సీజన్‌లో బోణీ కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తున్నది. చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 0-3 తేడాతో ఓడిపోయింది. అయినా ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు తమ పోరాట పటిమను చూపారు. ఆఖర్లో చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా చెన్నయిన్ ఆధిపత్యం సాధించింది. ఇక ఐఎస్ఎల్ 2020-21 సీజన్ విజేత ముంబై సిటీతో పోరు అంత సులభమేమీ కాదు.
లీగ్‌లోని మేటి జట్లలో ఒకటైన ముంబైపై గెలవడానికి అవసరమైన వ్యూహాలు సిద్దం చేసినట్లు హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్ మనాలో మార్వెకజ్ అన్నారు. ‘ముంబైపై విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నిస్తాము. వారి బలం ఏమిటో మాకు తెలుసు. ముంబై ఎక్కువగా బంతి వారి ఆదీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి వ్యూహాన్ని తిప్పి కొట్టి మేమే ఎక్కువ సేపు బంతి ఉంచుకునేలా చూసుకుంటాం. ఇరు జట్ల మధ్య తప్పకుండా హోరాహోరీగా మ్యాచ్ జరుగుతంది’ అని కోచ్ అన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కీలక ప్లేయర్ హలీచరన్ సర్దారీ లేకుండా బరిలోకి దిగుతున్నది. ముంబై జట్టులోని విగ్నేష్ దక్షిణ మూర్తి కూడా మ్యాచ్ఆడబోవడం లేదు.