‘ఓల్డేజ్ హోమ్’ వల్లే హైదరాబాద్ డెవలప్ కావట్లేదు: దాసోజు శ్రవణ్

by  |
Dasoju Shravan
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శనివారం దాసోజు చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిటైర్డ్ అయిన ఉద్యోగులనే తిరిగి నియమించుకుంటోందని మండిపడ్డారు. కేవలం హెచ్ఎండీఏ కార్యాలయంలోనే సగం మందికి పైగా రిటైర్డ్ అయిన ఉద్యోగులే ఉన్నారన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం పనిచేసే కార్యాలయాన్ని ఓల్డేజ్ హోమ్‌గా తయారు చేశారన్నారు. ఈ కార్యాలయంలో 960 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. కేవలం 148 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. అందులోనూ సగం మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed