Cyber Crime : FBలో అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌.. రూ.24 లక్షలు మాయం

by Sumithra |   ( Updated:2021-06-10 09:29:19.0  )
Hyderabad cyber hackers robbed a person of Rs 24 lakh by making a Fb friend request
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బులున్న వాళ్లే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు. కస్టమర్ సర్వీస్ పేరిట, అమ్మాయి మాదిరిగా చాట్ చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. తీరా బాధితులు మోస పోయామని నిజం తెలుసుకునే లోపే ఐడెంటిటీ మార్చి జంప్ అవుతున్నారు. ఇలాంటి ఫ్రాడ్ కేసులు ఇటీవల కాలంలో చాలా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి రూ.24లక్షలు కొల్లగొట్టారు.

వివరాల్లోకివెళితే.. శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తికి మారియా అనే పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టారు. నిజంగానే అమ్మాయి అనుకుని బాధితుడు నందకుమార్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. అనంతరం కేటుగాళ్లు అమ్మాయిలానే నందకుమార్‌తో కొన్ని రోజులు చాట్ చేశారు. ఆ తర్వాత మన స్నేహానికి గుర్తుగా విలువైన బహుమతి పంపిస్తున్నట్లు సైబర్ మోసగాళ్లు అతన్ని నమ్మించారు. గిఫ్ట్ పార్సిల్ చార్జీలు పంపించాలని పలుమార్లు నందకుమార్‌కు అమ్మాయి వాయిస్ తో కాల్ చేశారు. నిజమని నమ్మిన అతను విడతల వారీగా సుమారు రూ.24 లక్షలను వారు చెప్పిన అకౌంట్ నెంబర్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తీరా బహుమతి రాకపోవడంతో మోసపోయినట్లు భావించి నందకుమార్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story