హెచ్‌సీఏలో సిద్దిపేటకు అవకాశం ఇవ్వండి

by Shyam |   ( Updated:2020-08-13 05:30:42.0  )
హెచ్‌సీఏలో సిద్దిపేటకు అవకాశం ఇవ్వండి
X

దిశ, సిద్దిపేట: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ మాజీ సారథి అజరుద్దీన్‌ను సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్ కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం అజరుద్దీన్ మాట్లాడుతూ…

మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి ఈ విషయం గురుంచి మాట్లాడారని, ఇవాళ హెచ్‌సీ‌ఏ ఆధ్వర్యంలో ఉప్పల్ గ్రౌండ్‌లో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. సిద్దిపేట మినీ స్టేడియం గురించి తాను విన్నానని, త్వరలోనే స్టేడియాన్ని సందర్శించి, తగిన వసతులను సమకూర్చి అక్కడ మ్యాచ్‌లు నిర్వహించే ప్రయత్నం చేస్తానని హమీ ఇచ్చారు. త్వరలోనే మంత్రి హరీష్ రావుని కూడా కలుస్తానని చెప్పారు.

Advertisement

Next Story