- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెగ్గింగ్ రహిత సిటీగా భాగ్యనగరం
దిశ, హైదరాబాద్: భాగ్యనగరాన్ని బెగ్గింగ్ రహిత సిటీగా మార్చనున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. నగరంలో ఉన్న యాచకులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి, వృత్తి నైపుణ్య శిక్షణనివ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద జీహెచ్ఎంసీని ఎంపిక చేసినట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. టూరిజం ప్లాజాలో జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు, ఎన్జీవోలతో శనివారం నిర్వహించిన సదస్సులో.. యాచకులకు పునరావాసం కల్పించే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పది నగరాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బెగ్గర్స్ పునరావాసానికి రూ.10కోట్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. యాచకులుగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
Read also..