వాహనాల మైలేజీ పెంచే సరికొత్త ఆవిష్కరణను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ టెకీ!

by Harish |
Hyderabad-based-techie-deve
X

దిశ, వెబ్‌డెస్క్: కర్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక నిపుణులు డేవిడ్ ఎష్కోల్ ఇంధనాన్ని ఆదా చేసేలా కొత్త ఆవిష్కరణను రూపొందించారు. ‘5ఎమ్ మైలేజ్ బూస్టర్’ పేరుతో ఈ కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చిన డేవిడ్ దీన్ని వినియోగించి ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వాహన మైలేజీని కూడా పెంచుతుందని చెప్పారు. ఈ కొత్త అవిష్కరణ ఐదు రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని, దీన్ని వాహనాలకు అమర్చి అధిక మైలేజీ, మెరుగైన పికప్, సౌకర్యవంతమైన డ్రైవింగ్, ఎక్కువ టార్క్‌ను పొందే వీలవుతుందని డేవిడ్ వివరించారు. ఈ ‘5ఎమ్ మైలేజ్ బూస్టర్’ను ఇంజిన్‌కు అమర్చడం ద్వారా తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దీన్ని 8,000 వాహనాలకు అమర్చినట్టు, 100సీసీ నుంచి 10 వేల సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌లకు దీని ఏర్పాటు చేసుకోవచ్చని డేవిడ్ వివరించారు. ఆటో పరిశ్రమలోని ఏదైనా కంపెనీ భాగస్వామ్యం ఉంటే దేశంలోని వాహనదారులు అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు డేవిడ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed