- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ పేతో మెట్రో ఒప్పందం..
దిశ ప్రతినిధి , హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ లాకింగ్ ప్రక్రియ జోరందుకుంటున్న తరుణంలో ప్రజా రవాణా వినియోగదారులకు కాంటాక్ట్ లెస్ పేమెంట్లకోసం పెరుగుతున్న అవసరాలను తీర్చాలని ఫోన్ పే సంకల్పించింది. హైదరాబాద్ మెట్రో రైల్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఫోన్ పే దశలవారీగా 3 కీలక సేవలను అందించనుంది. ఫోన్ పే స్విచ్ లో టికెట్లు లేదా పాసుల బుకింగ్, స్విచ్‌లో భౌతిక స్మార్ట్ కార్డు రీఛార్జి, చివరగా టోకెన్లు అందుకోవడం కోసం మెట్రో స్టేషన్ కౌంటర్లలో స్కాన్ అండ్ పే సౌకర్యాన్ని కల్పించనుంది. మొదటి దశలో ఫోన్ పే స్విచ్‌లో సింగిల్ జర్నీ, రిటర్న్ జర్నీ బుకింగ్‌కు వీలు కల్పించారు. మిగిలిన రెండు దశలను త్వరలో అమలు చేయనున్నారు.
నిరంతరాయమైన, సురక్షితమైన కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఆప్షన్లను హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల ప్రయాణీకులకు అందించడం కోసం ఎల్ అండ్ టీ మెట్రోరైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (హైదరాబాద్ మెట్రో)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని దేశంలోని అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక ఫోన్ పే మంగళవారం ప్రకటించింది. ప్రతిరోజూ ఈ సేవలను అందుకునే ప్రయాణీకులు ఇక ఫోన్ పే స్విచ్ వేదికలో డిజిటల్ క్యూఆర్ ఆధారిత టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుందని, ప్రయాణాన్ని చేసే వారు.. చేయాల్సిందల్లా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలోని లోనికి వెళ్లే , బయటకు వచ్చే గేట్ల వద్ద తమ ఫోన్లలోని ఇ-టికెట్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా టోకెన్ అందుకోవడానికి, పాస్ కొనడానికి ఎంతమాత్రమూ ప్రయాణీకులు క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఈ భాగస్వామ్యం హైదరాబాద్ మెట్రో అధికారులకు కూడా వారి కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడంలో సహాయపడుతుంది.