శీలం రంగయ్యది లాక్‌ అప్ డెత్ కాదు..ఆత్మహత్యే

by Shyam |
శీలం రంగయ్యది లాక్‌ అప్ డెత్ కాదు..ఆత్మహత్యే
X

దిశ, న్యూస్ బ్యూరో: మంథనికి చెందిన శీలం రంగయ్య మృతికి లాకప్ డెత్ కారణం కాదని, ఆత్మహత్యే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను శుక్రవారం హైకోర్టుకు సమర్పించారు. రంగయ్య మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ నివేదికలో సీపీ పేర్కొన్న అంశాలపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యం చేసుకుని ఏవైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

మంథనికి చెందిన శీలం రంగయ్యను ఒక కేసు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని లాకప్‌లో పెట్టారు. అతను అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు.ఈ ఘటనపై పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు అది హైకోర్టు దాకా వెళ్ళింది. అనుమానాస్పద మృతిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు హైకోర్టు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపి నివేదికను సమర్పించినా..పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed