- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్..?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థి దొరికాడని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ హుజురాబాద్ నుంచి ఈటలకు పోటీగా ధీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చాలా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. దళిత వర్గాల ఓట్లు కూడా ప్రభావం చూపించే స్థాయిలో ఉండటంతో అక్కడ ముందుగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తెరపైకి వచ్చింది. కానీ, సోమవారం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఐపీఎస్, తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం ఒక విధంగా సంచలనం అయితే.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయనే టీఆర్‌ఎస్ అభ్యర్థి అనేది మరో సంచలనంగా మారింది.
దీన్ని రాజకీయ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్, స్వేరో అధినేత పేరు దళిత వర్గాలన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే ప్రచారం సైతం ఉంది. అంతేగాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని “మా ఊరికి రండి.. మాతోనే ఉండండి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. హుజురాబాద్‌తో పాటు కమలాపూర్, భీమదేవరపల్లి, హుస్నాబాద్ప్రాంతంలో ప్రవీణ్‌కుమార్ ఈ నినాదంపై ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే నక్సలైట్ పార్టీలో పనిచేసిన సానుభూతిపరులను సైతం ‘మా ఊరికి రండి’ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు. దీంతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొంత ఆదరణ ఉంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్.. కొంతకాలంగా రాజకీయాలపై ఇష్టం చూపిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే స్వేరో స్టార్ పేరుతో ఓ సంస్థకు వెనుకనుంచి నాయకత్వం వహిస్తూ ప్రోత్సహిస్తున్నారని గతంలోనే ఆరోపణలున్నాయి. అయినా కూడా ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేగాకుండా.. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి పోస్టును ఏండ్ల నుంచి ఆయనకే పరిమితం చేస్తోంది. మరోవైపు ఆయన భార్య లక్ష్మీబాయి కూడా కన్ఫర్డ్ ఐఏఎస్‌గా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హుజురాబాద్నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన్ను అక్కడి నుంచి పోటీకి దింపనున్నారని, అందుకే సీఎం కేసీఆర్ సూచనతోనే ఐపీఎస్‌కు రాజీనామా చేశారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఇప్పుడు టికెట్ ఇవ్వకున్నా.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ బాధ్యతలన్నీ ప్రవీణ్ కుమార్‌కు అప్పగిస్తారని, దీంతో దళిత వర్గాల ఓట్లు పదిలంగా అధికార పార్టీ ఖాతాలోనే ఉంటాయని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా హుజురాబాద్ ఉప ఎన్నికలతో లింక్ ఉన్నట్లేనని అంచనా వేస్తున్నారు.
రూ. 55 పొదుపుతో నెలకు 3000 పింఛన్ పొందండిలా.
బిగ్ బ్రేకింగ్… ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
టీఆర్ఎస్ కుక్కకు డిపాజిట్ గల్లంతు కావాలి.. మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్
దమ్మున్న వార్తలు..
ఎప్పటికప్పుడు..
6:30 PM EDITION
1. ఐపీఎస్ ప్రవీణ్ రాజీనామా హుజూరాబాద్ కోసమేనా?
2. ప్రజలు చనిపోతూనే ఉండాలా?
3. ప్రయాణం మొదలైందన్న మాజీ క్రికెటర్
4. రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న రెబల్ ఎంపీ
ఇంకా మరెన్నో ట్రెండింగ్ న్యూస్ దిశ డైనమిక్ ఎడిషన్‌లో…