- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి’
దిశ, సిద్దిపేట: మహిళా శక్తి గొప్పదని మహిళలు తలచుకుంటే కానిది ఏది లేదని, త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్ధిపేటలోని వయోలా గార్డెన్ లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా రాణి రుద్రమ, సమ్మక్క-సారక్కల స్ఫూర్తితో పోరాడాలని సూచించారు.
ముఖ్యంగా త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి మహిళ సోదరి కష్టపడాలని అన్నారు. పార్టీలో పనిచేసే మహిళలు హుజురాబాద్ లోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పోలింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయడంతో పాటు బీజేపీకి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు అన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం, విలువ లేదని విమర్శించారు. కానీ దేశాన్ని ఏలుతున్న కేంద్రంలోని బీజేపీ పార్టీలో పదకొండు మంది మహిళలకు కేబినెట్లో చోటు కల్పించడం బీజేపీ కే సాధ్యం అయ్యిందని అన్నారు. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలం అని గుర్తు చేశారు. కార్యకర్తలు కష్టపడడంతోనే దుబ్బాకలో తాను గెలిచానని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
బీజేపీ పార్టీలో మహిళలకు ఉన్న విలువ మరే ఇతర పార్టీలో ఉండదని చెప్పారు. ఎక్కడైతే స్త్రీలు ఎక్కువగా గౌరవించ పడతారరో అక్కడే సమాజం ఉన్నతమైన సమ సమాజంగా నిలుస్తుందన్నారు. ఎవరు నిరాశా నిస్పృహలకు లోను కాకుండా పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘటన మంత్రి శ్రీనివాస్ జీ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాల్లు గీతా రాణి, సులోచన, నివేదిత రెడ్డి, జాజుల గౌరి, మాలతి రావు, తోకల ఉమారాణి, గాడిపల్లి అరుణ రెడ్డి, సుధా రెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, స్వరూప, పద్మ, స్వప్న బాలమని, విజయలక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.