- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి హుజురాబాద్ పంచాయితీ.. అసలు ఏం జరిగింది?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పరిశీలన మొదలుపెట్టింది. ఉపఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న టీపీసీసీ నుంచి పలువురు నేతలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. పార్టీలో హుజురాబాద్ బై ఎలక్షన్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య హుజురాబాద్ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కొందరు ఆరోపిస్తుంటే.. పార్టీ కోసం పనిచేయని నేతలు రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది.
ఏం జరిగింది..?
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజురాబాద్‌లో పోటీ చేసిన బల్మూరి వెంకట్‌తో పాటుగా ఏఐసీసీ సభ్యులు, కార్యదర్శులను ఢిల్లీకి రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరపనుంది. హుజురాబాద్‌లో దారుణమైన ఓటమికి గల కారణాలపై హైకమాండ్ చర్చించనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు కొందరు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పడిపోవడంపై అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసమే కాంగ్రెస్ ఇలా చేసిందనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సైతం ఇదే ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే ఓటమిపై సమీక్ష జరపాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అసలు హుజురాబాద్ లో కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ నివేదిక టీపీసీసీకి వచ్చిందా ? అధిష్టానానికి చేరిందా? అన్న విషయంలో మాత్రం ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. ఇంత దారుణమైన ఫలితం ఎందుకు వచ్చిందనే దానిపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలతో ఏం చర్చించనుంది, అధిష్టానానికి ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటారనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.
అప్రమత్తం కోసమేనా..?
రాష్ట్రంలో ఎలాగైనా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి హుజురాబాద్ ఫలితం మింగుడు పడటం లేదు. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవటం కొంత ఇబ్బంది పరిస్థితులేనని భావిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, ఇప్పుడు హుజురాబాద్ లో బీజేపీ వరుసగా విజయాలు సాధించటంతో కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని సంబురపడుతున్న సమయంలో ఇంత దారుణంగా హుజురాబాద్‌లో ఓట్లు రావటంతో పార్టీలో భారీ కుదుపు వచ్చింది. ఊహించని విధంగా అతి తక్కువ ఓట్లు రావటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అవుతోంది. అటు బీజేపీ పుంజుకోవటంపైనా ఏఐసీసీ అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీని గెలిపించటం ద్వారా టీఆర్ఎస్ను దెబ్బ తీసినట్లే అవుతుందని, దాని కోసం పరోక్షంగా బీజేపీకి సహకరించారనే ఆరోపణలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు నేతలు చేస్తున్నారు. ఏఐసీసీకి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ నేతలను ఢిల్లీకి పిలిచారు. అంతేకాకుండా అసంతృప్తితో.. వ్యతిరేక ఆరోపణలు చేస్తున్న నేతలను కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.