- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ బై పోల్ కౌంటింగ్.. 22 రౌండ్లలో ఫలితం
దిశ, కరీంనగర్ సిటీ: 2 హాళ్లు, 14 టేబుళ్లు, 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తేలబోతుంది. మంగళవారం నిర్వహించనున్న ఉప ఎన్నిక లెక్కింపు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వగా, తీసుకున్న ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. మొత్తం 306 ఈవీఎంలు పోలింగ్ కోసం వినియోగించామన్నారు. 22 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు, ఒక్కో రౌండుకు 14 ఈవీఎంలలో పోలైన ఓట్లు గణించనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థులు, వాళ్ల ఏజెంట్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగుతోందని, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు ఇచ్చే శిక్షణ కూడా పూర్తి అయినట్లు ఆదివారం తెలిపారు.