- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ బై పోల్ ఎఫెక్ట్.. కుల సంఘాలకు ఎర
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సామాజిక వర్గాలే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ ఓటర్లకు ఎర వేయడం ఆరంభించింది.
కులాల వారిగా సమీకరణాలు…
గ్రౌండ్ లెవల్లో పార్టీకి అనుకూలంగా మారాలంటే కులాల వారిగా సమీకరణలు చేయాలని భావించిన టీఆర్ఎస్ పార్టీ, వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు రంగనాయక్ సాగర్ వేదికగా ఆయా సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఎన్నికల నోటిఫకేషన్ వచ్చే నాటికి ఓటర్లను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు కుల సంఘాల స్థలాలు, నిధులను కూడా కెటాయింస్తుంది ప్రభుత్వం. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఆయా సామాజిక వర్గాలకు ప్రభుత్వ స్థలాలను కెటాయించడం ఆరంభించింది. అయితే జమ్మికుంట శివార్లలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి కెటాయించిన భూమి విషయంలో వివాదం నెలకొనడం గమనార్హం.
నేతన్నలు అనుకూలమైనా..?
హుజురాబాద్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన సామాజిక వర్గాల్లో ఒకటైన పద్మశాలి సామాజిక వర్గం ఎటు వైపు అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. రాష్ట్రంలో నేతన్నలు అంటే సిరిసిల్ల అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం ఆ సామాజిక వర్గంలో నెలకొంది. ఇటీవల రాష్ట్ర స్థాయి సంఘ బాధ్యలకు సంబంధించిన ఓ బృందం కూడా హుజురాబాద్‌లో పర్యటించింది. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగిన ఈ కమిటీ పద్మశాలీల అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీ ముందు హుజురాబాద్ నేతన్నలు తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరిస్తోందన్న అభిప్రాయమే వ్యక్తం చేసినట్టు సమాచారం. 26 వేలకు పైగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవల్సిన ఆవశ్యకత టీఆర్ఎస్ పై పడింది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించి సరిపెట్టుకుంటే మాత్రం తాము ఊరు కోమని, నిరంతరం తమ ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అక్కడి నేతన్నలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వరకేనా…
అయితే హుజురాబాద్ ప్రాంత ఓటర్లలో మరో చర్చ కూడా సాగుతోంది. బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటలను ఓడించేందుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎర వేస్తోందా లేక ఇప్పుడు ఇస్తున్న హామీలను నెరవేరుస్తుందా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీల వలె తాత్కాలికంగా ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రక్రియ సాగితే మాత్రం తరువాత తాము తెల్లమొఖాలు వేసుకోవాల్సి వస్తుందన్న భయం కూడా ఆయా సామాజిక వర్గాల పెద్దల్లో నెలకొంది.
రమణ చేరికతో సీన్ మారేనా..?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ చేరికతో హుజురాబాద్ లో సీన్ మారుతుందా అన్న చర్చ మొదలైంది. ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకోవడంతో హుజురాబాద్‌లో అనుకూల పరిస్థితులు వస్తాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. బీసీ వర్గాలతో పాటు నియోజకవర్గంలోని పద్మశాలి ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో రాష్ట్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా పని చేసిన రమణ వ్యక్తిగత పరిచయాలతో లాభం పొందాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అధినేత అంచనాలకు తగ్గట్టుగా సమీకరణాలు మారుతాయా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.