ప్రారంభమైన హుజురాబాద్, బద్వేల్ ఓట్ల లెక్కింపు

by Shyam |   ( Updated:2021-11-01 22:20:29.0  )
Huzurabad by-election
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలవ్వగా.. మధ్యాహ్నం 4 గంటల కల్లా ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. హుజురాబాద్ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. దీంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

హుజురాబాద్ కౌంటింగ్ కరీంనగర్ లోని ఎస్‌ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో జరుగుతోంది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో 2 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.

అటు బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో బద్వేల్ ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. 10 లేదా 12 రౌండ్లలో తుది ఫలితం వచ్చే అవకాశముంది. తమకు భారీ మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed