- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుజురాబాద్‌లో ఏ ఇంట్లో చూసినా ఇదే నడుస్తుందట..
దిశ, హుజురాబాద్ : ఇయ్యాల ఉన్నడు ఇంటికాడ. ఐదు నెలలాయే చూడక మా వోన్ని. పొద్దగాల లేచే వరకే బయట పడతాండు, రాత్రి పండుకున్నాక ఇంటికి అత్తాండు. నాలుగు ముచ్చట్లు మాట్లాడుదామన్న కుదరలే. మనిషిని చూసి మురిసిపోదామన్నాఆగుపించలే. దసర పండుగ పుణ్యమా అని ఐదు నెలలకు గానీ మావోన్ని తనివితీరా చూసుకోవడ్తిని. ఇది హుజురాబాద్ నియోజకవర్గంలో సగటు కుటుంబాల పరిస్థితి. ఎప్పుడైతే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండో ఆనాటి నుంచి దినాం మొత్తం ఊర్లపొంటే తిరుగుతుండు. మీటింగులకు పొతే బువ్వ పెట్టిరి, ఇంటి కచ్చేటప్పుడు అరుసుకుని చేతిఖర్సులకని పిడికిట్ల కాగితాలు పెట్టిరి. ఎకువజాము పోవుడు, మునిమాపు చీకటి పడ్డంక ఇంటికచ్చుడాయే. గిట్లాంటి ఎన్నికలు నేనెఎప్పుడూ సూడలే.
ఎట్లయితేఎంటీ ఇంట్ల లొల్లి బందైంది. తాగుడుకు పైసల్లేవని బాధపడుడు కూడా లేకుండా పోయింది. ఇంక మీదికెళ్లి అన్ని కొనుకచ్చిత్తాండు. మళ్ల ఓట్లచ్చుడేందోగని మావోడయితే మస్తు ఉషారుగున్నడు. యాడాదికోసారి ఓట్ల జాతరొస్తే మా అసొంటోల్లకు మంచిదే. ఈళ్లు, ఆళ్ళు అని కాదు మీటింగ్‌కు పొతే ఓ లెక్క, కండువా కప్పుకుంటే ఇంకో లెక్క అన్నట్టుగా సాగుతోంది మావోళ్లకయితే పో. నిన్నటిదాకా అరుసుకున్నోళ్ళు అగుపించుకుండా పోయే సరికి దసరా పండగా నాడు దిక్కులు సూడాల్సి రావట్టే. పండుగ పూట అట్టిగుంటమా ఏంది..? ఏదోటి చేస్కుని ఎల్లదీసుకుంటం గని. శనివారం ఆళ్ళ సంగతి ఈళ్ల సంగతి చెప్పాలే. ఓట్ల పండగ దాక అంటే ఈ నెల 30 దాక మన రోజులే. ఏం చేద్దాం మరి. ఓటర్ మహానుభావుల చేతుల్లో అభ్యర్థుల బతుకుంది కదా..