హుజురాబాద్ ఉపఎన్నిక.. సీఎం జిమ్మిక్కులు స్టార్ట్ చేశారు: డీకే అరుణ

by Shyam |   ( Updated:2021-06-23 07:21:06.0  )
bjp leader dk aruna
X

దిశ, జడ్చర్ల : సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలుపుదల చేయించే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ లు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పర్యావరణ సంరక్షణలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఊహల లోకాలకు తీసుకు వెళ్తున్నారని, ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల జిమ్మిక్కులు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అలాగే పాలమూరు జిల్లాకు కేసీఆర్‌ తీవ్రమైన అన్యాయం చేశారని ఆర్డీఎస్, కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కూడా అన్యాయం చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కుమ్మక్కై పాలమూరు జిల్లాను అన్ని విధాల అన్యాయానికి గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఆర్డీఎస్ విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ ను ఆమె డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా పేరు చెప్పుకొని ఉద్యమాన్ని నడిపించి పాలమూరు ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని, పాలమూరు జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీనివాస్ గౌడ్, వెంకట్రాంరెడ్డి, సాహితి రెడ్డి, రాజు, యాదయ్య, శ్రీనివాసులు, ప్రతాప్ రెడ్డి లతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed