- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏంది సారు.. స్వచ్ఛ భారత్ ఇలాగే ఉంటదా..?
దిశ, వెబ్‌డెస్క్ : పైన కనిపిస్తున్న చిత్రం ‘స్వచ్ఛ భారత్’ అమలు తీరుకు నిదర్శనం. ఇంటితోపాటు గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్థానిక నాయకులు, అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రభుత్వం ఇంటింటికీ డస్ట్ బిన్‌లను పంపిణీ చేసింది. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ట్రాక్టర్లను కేటాయించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. వీధుల్లో, రోడ్లపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులోనిది పై చిత్రం. పెండ్యాల కోటేశ్వర్ రావు ఇంటి సమీపంలో పేరుకుపోయింది. చెత్త వేసిన ప్రాంతంలోనే స్వచ్ఛ భారత్ పై ప్రచారం కల్పిస్తూ.. వాల్ పెయింటింగ్ ఉండడంతో పట్టణ యువత ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏంది సారు.. హుజూర్ నగర్‌లో స్వచ్ఛ భారత్ ఇలాగే ఉంటదా..? అని నిలదీస్తున్నారు.