శాంతిభద్రతలపై ఎప్పడూ రాజీపడలేదు: కేటీఆర్

by Shyam |
శాంతిభద్రతలపై ఎప్పడూ రాజీపడలేదు: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ, ఔటర్ రింగ్‌రోడ్డు టౌన్‌ షిప్‌లను డెవలప్ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ, లైఫ్ సెన్సెస్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్ రంగాలకు అద్భుతమైన భవిష్యత్‌ హైదరాబాద్‌లో ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. హోటల్ మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ అని, ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. మత ఘర్షణలు, ప్రాంతీయ విభేదాలు లేవని, ఆరేళ్లుగా హైదరాబాద్‌ ఎంతో ప్రశాంతంగా ఉందని వెల్లడించారు. ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్‌‌లో 5లక్షల సీసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎప్పడూ రాజీపడలేదన్నారు. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed