- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వేం మగాడివి రా.. అనుమానంతో ఏకంగా..
దిశ, వెబ్ డెస్క్ : భార్య పై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. తరచూ శాడిజం చూపిస్తూ పైశాచికానందం పొందేవాడు. లేని పోని నిందలు వేసి తరచూ గొడవకు దిగే వాడు. చివరికి గుట్టు చప్పుడు కాకుండా ఆమెను మట్టు పెట్టాడు. కర్నాటక లోని ఆడుగోడి ప్రాంతంలోని రాజేంద్ర నగర్ లో నిసార్, ఆయేషా దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే తాగుడుకు బానిసైన నిసార్ నిత్యం భార్యతో గొడవకు దిగేవాడు. లేని పోని నిందలు వేసే వాడు. చివరకు ఆమెను గ్యాస్ కు బలి చేశాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో వంట గదిలోని గ్యాస్ సిలీండర్ ను లీక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అందరికీ ఇది ప్రమాదవ శాత్తూ జరగిందని నమ్మించాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. నిసార్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు అతడి ఫోన్ ను ట్రేస్ చేశారు. దాంతో ఆంద్రా సరిహద్దుల్లో అతడు మరణించినట్టు గుర్తించారు. నిజం తెలిసిపోయిందని భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఆడుగోడి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.