కరోనాభయం.. భార్యను తరిమేశాడు..

by srinivas |
కరోనాభయం.. భార్యను తరిమేశాడు..
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందర్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోనన్న కరోనా భయం వెంటాడుతోంది. కొందరు మాత్రం అతిగా ఊహించుకుంటున్నారు. అతిభయంతో కుటుంబ సభ్యుల్ని ఇబ్బందుల్లో నెట్టేస్తున్నారు. చట్టు పక్కల జనాల మాటలు విని, అపోహాలతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. కన్న కొడుక్కు జ్వరం వచ్చిందని భార్యను పుట్టింటికి పంపించాడో భర్త.
చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతులకు మూడో తరగతి చదువుతున్న కొడుకు సంజీవరెడ్డి ఉన్నాడు. నాలుగు రోజులుగా సంజీవరెడ్డి టయిఫాడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన తండ్రి రాజారెడ్డి కొడుకుకు కరోనా వైరస్ సోకిందని భావించాడు. భార్యను కొట్టి కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇద్దర్ని ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సై స్థానిక సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. వారిద్దరిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. బాలున్ని పరీక్షించిన డాక్టర్ అతనిలో కరోనా లక్షణాలు లేవని, జ్వరంతో బాధపడుతున్నాడని తేల్చి చెప్పాడు. తర్వాత ఆరోగ్య కార్యకర్త వారిద్దరిని తిరిగి ఇంటికి తీసుకెళ్లి భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చింది.

Tags: Corona fear, He sent his wife out of the house, In East Godavari district, Counseling to take the husband home

Advertisement

Next Story

Most Viewed