- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫీ పేరుతో భార్య ఉసురు తీసిన భర్త
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దేవుడిని దర్శించుకుందాం.. అని చెప్పి తీసుకువచ్చి సెల్ఫీ దిగుదాం అని కొండ అంచుల వరకు తీసుకువెళ్లి ఎవరు చూడడం లేదు అని నిర్ధారించుకుని తన భార్యను కొండ అంచుల నిండి కిందకు తోసి ఆమె ప్రాణాలు తీశాడు భర్త. ఇందుకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రంజన్ రతన్ హత్యకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అయిజ మండలం పరిధిపురం గ్రామానికి చెందిన మద్దిలేటి గౌడ్ దంపతుల కూతురు గీతాంజలి అలియాస్ శరణ్య(19)కి రెండు నెలల క్రితం గట్టు మండలం, చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ఈడిగ జయరాముడు అనే యువకునికి ఇచ్చి సాంప్రదాయ రీతిలో వివాహం జరిపారు.
వివాహం జరిగినప్పటి నుండి తనతో ఆమె చనువుగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్నాడు. తన భార్య తనతో సరిగా కాపురం చేయడం లేదని తల్లిదండ్రులకు తెలిపాడు. కొత్తగా వివాహం అయింది కలుసుకోవాలని తమ కుమారునికి హితబోధ చేసుకున్నారు.. ఆమెలో మార్పు రాదు అని భావించి ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం తాను చిన్నప్పుడు చదువుకున్న వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టను అనువైన స్థలంగా ఎంపిక తీసుకొని ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య ఆధార్ కార్డులో ఉన్న చిరునామాను మార్చుకొని వద్దామని ఈ నెల 11న తన టీఎస్ 331584 నంబర్ గల మోటార్ సైకిల్‌పై గట్టు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ పలు కారణాలు చెప్పి వనపర్తి తిరుమల గట్టుపై ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకుని వద్దామని ఒప్పించి తీసుకు వెళ్ళాడు. ఉదయం పదకొండున్నర గంటలకు ప్రాంతంలో సెల్ఫీ దిగుతామని కొండ పైభాగానికి తీసుకుని వెళ్ళాడు.
కొండ పైభాగం నుండి కింద ప్రకృతి దృశ్యాలు కనిపించే విధంగా సెల్ఫీ తీద్దాం అని చెప్పి తన భార్య గీతాంజలిని ఒప్పించాడు. సెల్ఫీ దిగుతున్నట్లుగా నటించి చుట్టుపక్కల ఎవరూ లేరు అని నిర్ధారించుకుని జయరాముడు తన భార్యను కిందకు తోసేసాడు. ఏమి తెలియని వాడిలా తిరిగి అయిజకు వచ్చి కట్టు కథలు చెప్పి తన భార్య కనిపించడం లేదని, తన మామ మద్దిలేటి గౌడ్, తదితరులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మృతురాలి తండ్రి తన కూతురు కనిపించడం లేదని అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జయరాముడిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.