- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Extra-marital-affair:పెళ్లాంతో పనేంటి.. ఆమె హత్యకు అద్భుతమైన స్టోరీ అల్లిన భర్త..!
దిశ, వెబ్‌డెస్క్ : భార్య, భర్తల మధ్య మనస్పర్దలు రావడానికి ఎన్నో కారణాలున్నా.. అది ఒకరినొకరు చంపుకోవడానికి వెళ్లిందంటే మేజర్ రీజన్ వివాహేతర సంబంధమే. డబ్బుల కోసమో, తనను పట్టించుకోదని.. ఒకరి మీద మరొకరికి ప్రేమ తగ్గిందనో వచ్చే మనస్పర్ధలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. త్వరగానే సమసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత రోజుల్లో భార్య మీద భర్తకు, భర్త మీద భర్తకు నమ్మకం లేకపోవడం వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారనే భావన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. అది నిజంగా వివాహేతర సంబంధమని తేలితే ఇద్దరిలో ఒకరు చంపడానికైనా లేదా చవడానికైనా తెగిస్తున్నారు. ఇంకొన్ని ఘటనల్లో తమ వివాహేతర సంబంధాన్ని కంటిస్యూ చేసేందుకు కట్టుకున్న వారినే దారుణంగా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, ఆ కేసు నుంచి తప్పించుకునేందుక నిందితుడు పోలీసులను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు.
వివరాల్లోకివెళితే.. ఢిల్లీకి చెందిన 25ఏళ్ల వికాస్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. తన భర్త ఇంకొకరితో చనువుగా ఉండటాన్ని భరించలేని ప్రియాంక ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఎలాగైన భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న వికాస్ మంగళవారం రాత్రి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి ఓ కట్టుకథ అల్లాడు. తాను ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి తన భార్యను దారుణంగా పొడిచి చంపారని.. అనంతరం ఎస్కేప్ అయ్యారని పోలీసులకు వివరించాడు. తీరా రంగంలోకి దిగిన పోలీసులు అతను చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతన లేదని గ్రహించారు. తీరా వారి స్టైల్లో విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.